రాయపర్తి, అక్టోబర్ 24 (దిశ పవర్): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఊకల్ గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి నర్రా దేవేందర్ (50) అనే మత్స్యకారుడు మృతి చెందాడు. శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.స్థానికుల వివరాల ప్రకారం.. దేవేందర్ ఇంటి వద్ద ఉన్న రేకుల షెడ్డులో విద్యుత్ సర్వీస్ వైరు తెగిపడి ఉంది. ఈ విషయాన్ని గమనించని దేవేందర్ షెడ్డులోకి వెళ్లే క్రమంలో ప్రమాదవశాత్తు ఆ వైరు తాకడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీవ్ర విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు.మృతుడు దేవేందర్‌కు భార్య జయలక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో ఊకల్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Post Views: 59










