విద్యుత్ ఘాతంతో వీరభద్రయ్య మృతి
రాయపర్తి, అక్టోబర్ 31 దిశ పవర్ న్యూస్వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తిర్మలాయపల్లి గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై ముద్రబోయిన వీరభద్రయ్య (59) మృతి చెందాడు. శనివారం ఉదయం ఏడు గంటలకు నల్ల మోటార్‌కు నీరు లెవల్ పోస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు,
Post Views: 265










