దిశ పవర్ రఘునాథ్ పల్లి :- రఘునాథపల్లి మాజీ జడ్పీటీసీ, జనగామ జిల్లా జడ్పీటీసీల ఫోరం అధ్యక్షులు, బొల్లం అజయ్ ఆత్మీయుడు అకాల మరణం చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని జనగామ జిల్లా నాయకులు అల్లం ప్రదీప్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా అల్లం ప్రదీప్ రెడ్డి ఇతర నాయకులతో కలిసి దివంగత నేతకు ఘనంగా నివాళులర్పించారు. ఆయన మరణం పార్టీ శ్రేణులకు, అభిమానులకు, ఆత్మీయులకు తీరని లోటని పేర్కొన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సంతాపం వ్యక్తం చేశారు.ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, దివంగతుని ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో అల్లం ప్రదీప్ రెడ్డితో పాటు పలువురు జనగామ జిల్లా నాయకులు పాల్గొని నివాళులర్పించారు.
Post Views: 85










