*ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక
పెద్ద తాండ గ్రామంలో గ్రామ సభలో పాల్గొన్న సర్పంచ్
-యం.నార్య నాయక్.
-స్పెషల్ ఆఫీసర్ జొహన్నా.
జోగులాంబ గద్వాల జిల్లా మల్దక ల్ మండల పరిధిలోని పెద్ద తాండ గ్రామ పంచాయతీ కార్యాలయం లో గురువారం పంచాయతీ సెక్ర టరీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామ సభ లో గ్రామ సర్పంచ్ అధ్యక్షతన గ్రామ సభ సమావేశం నిర్వహించారు. సమావేశాలో గ్రామ అభివృద్ధి ప్రణాళికా, రూప కల్పన, అమలుపై చర్చించి. ముందుగా శాంటేషాన్ గ్రామ సమస్యల గురించి మరియు వేసవి కాలం లో వాటర్ సమస్య గురించి చర్చించడం జరిగింది. ఈ సంద ర్బంగా గ్రామ సర్పంచ్ నార్య నాయక్ మాట్లాడుతూ స్కూల్ లో మధ్యాహ్నం నాణ్యమైన భోజనం పిల్లలకు అందేలా చూడాలని స్కూల్ టీచర్లకు మరియు వర్కర్లు సూచించడం జరిగింది.అంగన్వాడి టీచర్లను చిన్నపిల్లలకు మరియు బాలింతలకు పౌష్టికాహారం సక్ర మంగా అందేలా సూచించడం జరిగింది.అలాగే ప్రభుత్య పథ కాలను అర్హులైన ప్రతిఒక్కరికి అందేలా చూస్తామని గ్రామ సర్పంచ్ భరోసా ఇవ్వడం జరిగింది. ఈయొక్క గ్రామ
సభకు వివిధ శాఖల అధికా
రులు పాల్గొన్నందుకు ధన్యవాదములు తెలు
పడం జరిగింది.ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ నర్సింహు లు,ఉప సర్పంచ్ భిక్య నాయక్ వార్డు సభ్యులు, ఏఈఓ ఏఎన్ఎం ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ఆశావర్కర్లు, గ్రామ స్తులు,యువకులు మరియు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.











