ప్రజల సమస్యల పరిష్కారానికే గ్రామసభలు సర్పంచ్ దేశపాగ నరసింహ
*(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం ఏప్రిల్ 02:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని నందుపల్లి గ్రామంలో.. గ్రామ సర్పంచ్ దేశపాగ నరసింహ యాదవ్ మాట్లాడుతూ.. గ్రామంలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామసభ నిర్వహించడం జరిగిందన్నారు గ్రామసభలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 6 గ్యారంటీ ల గురించి ప్రజలకు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో ఇంకా గ్రామంలోని సమస్యల గురించి తెలుసుకోవడం జరిగిందన్నారు ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా.. గ్రామంలోని ముఖ్యమైన సమస్యల గురించి చర్చించరు. కరెంటు, వాటర్ మెదలగు సమస్యలను పరిష్కరిస్తామని మాట ఇచ్చారు ఈ కార్యక్రమంలో, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబెర్ మరియు స్పెషల్ ఆఫీసర్ పి. మహేష్,గ్రామ పెద్దలు, యువకులు ఎస్ హెచ్ జి మహిళలు మరియు ప్రజా ప్రతినిధులు హాజరై ఈ కార్యక్రమని విజయవంతం చేసారు











