ఎల్కతుర్తి లో గుడ్ ఫ్రైడే ఆచరణలు భక్తిశ్రద్ధలతో*

–సిలువను మోసిన భక్తులు భక్తి శ్రద్దలతో శోభయాత్ర
ప్రజా గొంతుక ఏప్రిల్ ఎల్కతుర్తి ప్రతినిధి:
హనుమకొండ ఎల్కతుర్తి మండల కేంద్రంలోని క్యాథలిక్ చర్చి ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం భక్తిశ్రద్ధలతో కార్యక్రమాలు నిర్వహించారు. యేసుక్రీస్తు శిలువ వేయబడిన దినాన్ని స్మరించుకుంటూ ఫాదర్ జనార్దన్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.చర్చి ప్రాంగణం నుంచి సహాయ మాత 14వ స్థలం వరకు ‘వే ఆఫ్ ది క్రాస్’ శోభాయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు సిలువను మోస్తూ ప్రార్థనలు చేస్తూ ముందుకు సాగారు. మార్గమధ్యంలోని ప్రతి స్థలంలో యేసు క్రీస్తు అనుభవించిన బాధలను స్మరించుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం సహాయ మాత వద్దకు చేరుకుని సమూహంగా ప్రార్థనలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జయరాజ్, సిస్టర్స్ గ్రామ పెద్దలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు…











