ఇష్టపడిచదివితే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు
అమీర్ అలీ ఫౌండేషన్

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:06
నల్గొండ జిల్లా మిర్యాలగూడ విద్యార్థి దశనుండే ప్రణాళిక బద్ధంగా, కస్టపడి కాకుండా ఇష్టపడి చదివినట్లయితే జీవితం లో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని, తద్వారా వక్తిగత, కుటుంబ ఆశయాలు సాధించడమే కాకుండా సమాజ, దేశ సేవకు బాటలు వేసుకోవచ్చని అమీర్ అలీ ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు.యన్ యస్ పి క్యాంప్ ప్రాధమిక పాఠశాల నందు ప్రదానోపాధ్యాయులు బాస్యా నాయక్ అధ్యక్షతన 5 వ తరగతి ప్రవేశం పరీక్ష లో గురుకుల సీట్లు సాధించిన 10 మంది విద్యార్థులకు అమీర్ అలీ ఫౌండేషన్ తరపున ప్రోత్సాహకంగా మెమెంటో లు అందజేయడం జరిగింది.ఫౌండేషన్ నిర్వాహకులు అమీర్ అలీ,సందీప్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన ఉపాధ్యాయుల శిక్షణ లో నాణ్యమైన విద్య అందుతుందని,10 మంది విద్యార్థులకు గురుకుల సీట్లు రావడమే దానికి నిదర్శనం అని, క్యాంపు పరిసర ప్రాంత ప్రజలు యన్ యస్ పి క్యాంప్ పాఠశాలలో పిల్లలను చేర్పించి వారి బంగారు భవిషత్తు కు పునాది వేసుకోవాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు బాష్యా నాయక్ మాట్లాడుతూ పేద విద్యార్థులు చదివే ప్రభుత్వ పాఠశాలకు స్వచ్చంద సంస్థలు, ప్రజా ప్రతినిధులు మెరుగైన వసతులు కల్పించుటకు కృషి చేయాలని కోరారు. అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఫౌండేషన్ ను అభినందించారు.. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు సుదర్శన్ రెడ్డి, లక్ష్మి నారాయణ, జానయ్య, ఇందిరా, ఆదిలక్ష్మి, వెంకట లక్ష్మి, సిబ్బంది భూలక్షి, ఫౌండేషన్ సభ్యులు సందీప్ ,జానిపాష సత్తార్ అవిరేండ్ల సందీప్ పాల్గొన్నారు











