ఉద్యమకారులపై రౌడీ షీట్లను రద్దుచేసిన ఎమ్మెల్యే……. కుందూరు జైవీర్ రెడ్డి
ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేసిన ఉద్యమకారులు……
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:06
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గo తెలంగాణ మలిదశ ఉద్యమకారులపై తెలంగాణ మలిదశ ఉద్యమ కాలంలో నమోదైన రౌడీ షీట్లను ఇటీవల రద్దు చేసినందుకు స్థానిక నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి ని ఈరోజు(6-4-2026) వారి నివాసంలో వ్యక్తిగతంగా కలిసి శాలువా, పూలమాల తో వారిని సత్కరించి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసిన తెలంగాణ మలిదశ ఉద్యమకారులు అదేవిధంగా గత సాధారణ ఎన్నికలలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అయినా 250 గజాల ఇంటిస్థలం, ఉద్యమకారుల గుర్తింపు కార్డు ఉద్యమకారులకు పింఛన్ మంజూరు లను కూడా వీలైనంత తొందరగా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి ఉద్యమకారులకు మరింత చేయూతని ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత తొందరలో సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు ఈరోజు ఎమ్మెల్యేని కలిసిన తెలంగాణ మలిదశ ఉద్యమకారులు వర్ర వెంకటరెడ్డి, గోపిశెట్టి నరసింహ, కమతం జగదీశ్వర్ రెడ్డి, వాసికర్ల వినయ్ రెడ్డి, ఎడారి రాము, వద్ది రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గుంటుక మధుసూదన్ రెడ్డి, రావులపాటి ఎల్లయ్య, కోనేటి శ్రీనివాస్, వర్ర రామకృష్ణారెడ్డి,సయ్యద్ జావీద్ పాల్గొన్నారు











