అంగన్వాడి ల చైర్మన్ గా సర్పంచ్ ఎన్నిక…
అంగన్వాడిలో ఏ సమస్య ఉన్న మా దృష్టికి తీసుకురండి..
గోపాల్ నగర్ సర్పంచ్ పేరబోయిన కళ్యాణి పరుశురాములు
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
గోపాల్ నగర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రల ను స్థానిక సర్పంచ్ పేరబోయిన కళ్యాణి పరుశురాములు తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు, గర్భిణీలకు పంపిణి చేస్తున్న గుడ్లు, పాలు మరియు బాలామృతాన్ని పరిశీలించారు.తెలంగాణ రాష్ట్రంలో అంగన్‌వాడీకేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలు ప్రభుత్వం సర్పంచ్‌లకు అప్పగించింది. గోపాల్ నగర్ సర్పంచ్ చైర్మన్‌గా రెండు అంగన్వాడీ ల లో కలిపి 22 మందితో ప్రత్యేక కమిటీని నియమించారు. ఈ కమిటీలో అంగన్‌వాడీ టీచర్ , వివో, పాఠశాల సైన్స్ టీచర్, రిటైర్డ్ ఉద్యోగి, వార్డు మెంబర్,ఆరుగురు చిన్నారుల తల్లులు సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ కమిటీ గర్భిణులు, తల్లులు, బాలింతలకు ప్రతీనెలా బియ్యం, పప్పు, బాలామృతం పంపిణీని ప్రతినెల పర్యవేక్షించనున్నారు. ఆరోగ్యలక్ష్మి ద్వారా లబ్ధిదారులకు అందుతున్న భోజనాన్ని పరిశీలించి, చిన్నారుల తల్లులతో మాట్లాడారు. ఎలాంటి సమస్య ఉన్న తమకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చింతల కర్ణాకర్, వార్డు మెంబర్లు గంగరబోయిన ఐలయ్య, వద్ధి క్రాంతి, మహాలక్ష్మి సుభాష్, మాజీ వార్డ్ మెంబర్లు బొమ్మె నర్సింలు, అంగన్వాడి టీచర్లు పస్తం లక్ష్మి, పర్వతం భాగ్య ,ఆయాలు తదితరులు పాల్గొన్నారు.











