హాలియా పురపాలక సంఘం ఆధ్వర్యంలో
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం……
తులసి హాస్పిటల్స్ సౌజన్యంతో 2కే రన్..
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:07
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా హాలియా పురపాలక సంఘ ఆధ్వర్యంలో
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
ఘనంగా నిర్వహించారు.
వరల్డ్ హెల్త్ డే సందర్భంగా హాలియా మున్సిపాలిటీ తులసి హాస్పిటల్స్ సౌజన్యంతో 2కే రన్ తులసి హాస్పిటల్ నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు నిర్వహించడం జరిగింది. తదనంతరం పోషక విలువలతో కూడిన పౌష్టికమైన ఆహారం గుడ్లు, అరటి పండ్లు, మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా హాలియా మున్సిపాలిటీ ఆవరణంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని తులసి హాస్పిటల్స్ సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు.జైవీర్ రెడ్డి హాజరై తమ అమూల్యమైన సందేశాన్ని ఇస్తూ మున్సిపాలిటీ పరిశుభ్రంగా ఉండడానికి నిత్యం శ్రమిస్తున్న మున్సిపల్ కార్మికులకు మరియు సిబ్బందికి అందరికి అన్ని రకాల స్పెషలిస్ట్ డాక్టర్ల బృందం చే ఉచిత వైద్య పరీక్షలు, మెడిసిన్ అందించడం శుభపరిణామం అన్నారు. అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది. మున్సిపాలిటీ కౌన్సిలర్లు మరియు ప్రజలు ప్రతిరోజు శారీరక వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు
మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి మాట్లాడుతూ వ్యక్తిగత ఆరోగ్యానికి యోగ మరియు రన్నింగ్ చాలా అవసరం అని తెలియజేస్తూ ప్రతిరోజు కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయిస్తూ ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపాలని తెలియజేశారు.
ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా 2కే రన్ నిర్వహించిన అనంతరం టూకే రన్డ్లు పాల్గొన్న వారందరికీ ఉచిత వైద్య శిబిరాన్ని తులసి హాస్పిటల్ యజమాన్యం మాలే సంతోష్ రెడ్డి నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ కే రవీందర్ రెడ్డి, హాలియా మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గౌని రాజా రమేష్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాకునూరి నారాయణ గౌడ్, 2వ వార్డు సలహాదారులు నకిరేకంటి సైదులు , 4వ వార్డు సలహాదారులు కడమంచి శ్రీను, 5వ వార్డు సలహాదారులు చిట్టిపోలు కరుణాసాగర్,6వ వార్డు కౌన్సిలర్ బొంగరాల యేసు రాజు, 8వ వార్డు సలహాదారులు మజహార్ మొయినుద్దీన్, 9వ వార్డు కౌన్సిలర్ చెరుపల్లి ముత్యాలు, 10వ వార్డు సలహాదారులు పిల్లి ఆంజనేయులు ,12వ వార్డు సలహాదారులు ఎడవల్లి రంజిత్ ,పుర ప్రముఖులు, మున్సిపల్ సిబ్బంది, ప్రజలు పాల్గొని ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతం చేశారు.











