


ఎమ్మెల్యే పల్లా “ఆప్యాయ పలకరింపు”
నాయకులను,కార్యకర్తలను, ప్రజలను పరామర్శించిన ఎమ్మెల్యే…
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట మండల కేంద్రంలో మృతుల కుటుంబాలను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మండల టిఆర్ఎస్ నాయకులతో కలిసి పరామర్శించారు. శుక్రవారం మండల కేంద్రంలోని మాజీ సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి తమ్ముడు అయినా వడ్డేపల్లి రాజిరెడ్డి మరణించగా వారి కుటుంబాన్ని మృతురాలు గొలుగుల ఎల్లవ్వ కుటుంబాన్ని గొల్లూరి ప్రణయ్ కుటుంబాన్ని పరామర్శించారు. నాయకులను, కార్యకర్తలను, ప్రజలను ఆపద సమయంలో పరామర్శించి ఆర్థిక సహాయం అందించడంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ముందున్నారు. వారి ఇంటికి వచ్చిఎమ్మెల్యే పల్లా “ఆప్యాయ పలకరింపు”తో మాట్లాడడంతో వారు భావోద్యానికి గురయ్యారు. ఈ కార్యక్రమంలో వారి వెంట బిఆర్ఎస్ ముఖ్య నాయకులు రైతు బంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, ఈదులకంటి ప్రతాపరెడ్డి, గంధ మల్ల నరేందర్, బొమ్మన ఆంజనేయులు, అజీమ్, మహేష్, చింతల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.











