ఎమ్మెల్యేను కలిసి ఆశీర్వాదం తీసుకున్న అనిల్ రెడ్డి..
రాష్ట్రం కి యువ నాయకత్వం సేవలు అవసరం
—ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట మండల మాజీ వైస్ ఎంపీపీ కల్లూరి అనిల్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా జనగామ శాసనసభ్యులు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ని మోయినాబాద్ వారి ఫామ్ హౌస్ లో వారిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా శాలువలతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీకి యువ నాయకత్వం అవసరం ఉందని, మన నాయకులు కెసిఆర్, కేటీఆర్ సారధ్యంలో రాష్ట్రంలో మన పార్టీ అధికారంలోకి వచ్చేవరకు అందరూ సైనికుడుల పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రైతు సమన్వయ సమితి మండల మాజీ అధ్యక్షుడుచల్ల శ్రీనివాసరెడ్డి, సర్పంచుల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి,వేముల లక్ష్మణ్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు గందమల్ల నరేందర్, గంగం శివారెడ్డి,సోమేశ్, శ్రీకాంత్ వర్మ తదితరులు పాల్గొనడం జరిగింది.











