ఘనంగా మహాత్మ జ్యోతిబా పూలే జయంతి.
-జిల్లా వ్యవసాయ వృత్తిదారుల ప్రధాన కార్యదర్శి జి.నరసింహులు.
తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతి బాపూలే” 11 ఏప్రిల్ 1827 నుండి 199 వ జయంతి సందర్భంగా గట్టు మండలం ఎల్లం దొడ్డి గ్రామంలో 50 పైగా వ్యవసాయ కూలి పని నమ్ముకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న కూలీ లతో ఘనంగా జ్యోతిరావు పూలే జయం తిని నిర్వహించడం జరిగింది.ఈ సంద ర్భంలో జి.నర్సింలు జిల్లా ప్రధాన కార్య దర్శి ఈ విధంగా మాట్లాడుతూ సరిగ్గా, రెండు వందల సంవత్సరాల క్రితం అప్ప టి బొంబాయి ప్రెసిడెన్సీ లో (ఇప్పటి మహారాష్ట్ర)ఉన్న పూణే నగరంలో ఒక మహా సామాజిక విప్లవ వీరుడు జన్మిం చాడు.బాజీ రావు పీష్వా 2 పాలన లో బ్రాహ్మణుల కుల ఆధిపత్యం లో శూద్ర కులాల వారు అంటరానివారిగా, బాని సలుగా బతుకు లీ డిస్తున్న కాలమది.
పూణే నగరం బాజీరావు పీష్వా 2 అధి కారం లో ఉంది.సమాజంలో ఏ విధమైన హక్కులకు నోచుకోని, అంటే విద్యా, వైద్యం, ఆస్తి, పంచ భూతాలు అయినా గాలి, నీరు, నేల, కనీసం ఆలోశించి నిర్ణయాలు తీసుకోవడం,వేటి పైన కూడా క్రింది కులాల వారికి హక్కులు లేని రోజులు అవి. మూతి కి ముంత, నడుము కు తాటా కు కట్టుకుని అంటారని కులాల వారు జీవిస్తున్న కాలమది.తమ కోసం ఎవరు వస్తారా అని అస్పృశ్యులు ఎదురు చూస్తూ ఉన్న వేళ.అటువంటి సమయంలో పూణే నగరంలో “మాలీ”అనే ఒక శూద్ర (అంటారని బి.సి) కులం లో జన్మించాడు పూలే.తండ్రి పేరు గోవిందరావు .
తల్లి పేరు చిమ్నభాయి.పూలే తల్లి తండ్రులకు ఇద్దరు అబ్బాయిలు.
వారి లో చిన్న వాడు పూలే.ఆయన కు సంవత్సరం నిండకుండానే తన చిన్న తనంలోనే పూలే తల్లి చనిపోయింది.
వీరి వృత్తి వ్యవసాయం, అలాగే పూలు అమ్మడం.కుటుంబం మొత్తం ధనవం తులకు, కూరగాయలు పూలు, పూల దండలు అమ్ముకుంటూ జీవనం సాగించే వారు. అసలు తల్లి తండ్రులు పూలే కు “గోరె “అని పేరు పెట్టడం జరిగింది.
అయితే,జ్యోతి బా “అనే వారి కులదైవం సంవత్సర వేడుకలు ఇంట్లో జరుగు తున్న రోజున పుట్టడం వల్ల అందరూ ఆయనను “జ్యోతి బా “అనిముద్దు గా పిలిచే వారు.తర్వాత వారి కుటుంబ సభ్యులకు పూల దండలు తయారీలో ఉన్న ప్రత్యేక నైపుణ్యాలు వల్ల వారిని అందరూ పూలే అని పిలిచే వారు.
వారి వృత్తి నైపుణ్యం మెచ్చుకొని బాజీ రావు పీష్వా 2 వారి కుటుంబానికి ఇనామ్ గా 35 ఎకరాలు భూమి నీ కూడా ఇచ్చారు.











