*డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న శ్రీరాములు అందెల*
*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 14:)*
మహేశ్వరం నియోజకవర్గం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బడంగ్ పేట్ సర్కిల్ లో గల బడంగ్ పేట్ డివిజన్ లోని బడంగ్ పేట్ గ్రామంలో *ఉత్సవ కమిటీ సభ్యులు గట్టు శ్రీనివాస్* ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135 వ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు…ఈ యొక్క కార్యక్రమానికి *మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ అందెల శ్రీరాములు* హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ అంబేద్కర్ భారతదేశానికి సామాజిక న్యాయం, సమానత్వం, రాజ్యాంగ పరిరక్షణకు మార్గదర్శకుడని అన్నారు.
అంబేద్కర్ గారి ఆశయాలు ప్రతి భారతీయుడి జీవితంలో ప్రతిబింబించాలి అని ఆయన పేర్కొన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధికి అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. అదేవిధంగా, ప్రియతమ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అంబేద్కర్ గారి సిద్ధాంతాల ఆధారంగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, సామాజిక న్యాయం, సర్వ సమానత్వం సాధనలో కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బడంగ్ పేట్ బిజెపి అధ్యక్షులు రాళ్ల గూడెం రామకృష్ణారెడ్డి, బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు మాజీ సర్పంచ్ నడికుడ యాదగిరి, బిజెపి సీనియర్ నాయకులు సామ సంజీవ రెడ్డి, గుర్రం మల్లారెడ్డి, మాజీ కార్పొరేటర్లు గౌర రమాదేవి శ్రీనివాస్, బంగారు అనిత ప్రభాకర్, బిజెపి సీనియర్ నాయకులు చిత్రం శ్రీనివాస్, రేసు నరసింహారెడ్డి, దేశపాక జగన్, సామ సుధాకర్ రెడ్డి, బెల్దే జగదీశ్వర్ రాజు, మోర మహేందర్, ఓబిసి మోర్చా నాయకులు లాలా సందీప్, బిజెపి ప్రధాన కార్యదర్శి మురళీధర్ రెడ్డి, కార్యదర్శి ప్రవీణ్ గౌడ్, అంకం శ్రీనివాస్ గౌడ్ శ్రీకాంత్ గౌడ్, వెంకటరత్నం, ముదిగొండ కిషన్, మల్లేష్, మహిళా మోర్చా నాయకురాలు కావ్య, ఉత్సవ కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











