ప్రయాణీకుల దాహార్తీ తీరుస్తున్న చలివేంద్రాలు…….
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:17
నల్గొండ జిల్లా నాగర్జున సాగర్ నియోజకవర్గం లోని హలియా పట్టణంలో పెరుగుతున్న ఎండ తీవ్రత దృష్టిలో ఉంచుకొని బాటసారులకి ప్రయాణికుల దాహార్తీ తీర్చేందుకూ వివిధ స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో హౌస్ పెయింటర్ అమీర్ అలి తన మిత్రులు ఫౌండేషన్ సభ్యుల సహకారం తో అమీర్ అలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు హలియా మెయిన్ సెంటర్ మిర్యాలగూడ రోడ్డు లో కట్టా మనోహర్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజల దాహార్తీని తీరుస్తన్నారు పేరూర్ రోడ్డు లో సూరేపల్లి ఆటోడ్రైవర్స్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం అని అన్నారు
Post Views: 28











