అగ్ర నాయకుల కుట్రలకు బలవుతున్న దళిత అధికారులు
ధర్మసమాజ్ పార్టీ జిల్లా నాయకులు
బొంకూరి రాజు
ప్రజా గొంతుక ఏప్రిల్ 17:
ఎల్కతుర్తి మండలంలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ ప్రవీణ్ కుమార్ గారి పరిస్థితి అకస్మాత్తుగా ఇలా మారడం అత్యంత అనుమానాస్పదంగా, దురదృష్టకరంగా ఉందని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకులు బొంకూరి రాజు అన్నారు మండల ప్రజలలో ఆయనపై మంచి పేరు, నమ్మకం ఉన్న విషయం తెలిసిందే.
ఎస్ఐ ప్రవీణ్ కుమార్ గారు ఇప్పటివరకు ఎవరినీ కించపరచకుండా, ప్రతి ఒక్కరిని గౌరవంగా పలకరించి, సమస్యలు వినిపించిన వెంటనే పరిష్కారం చూపే అధికారిగా పేరు సంపాదించారు. ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా కాకుండా, నిష్పక్షపాతంగా పనిచేస్తూ ప్రతి ఒక్కరికి న్యాయం చేయడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.
పోలీస్ స్టేషన్కు వచ్చిన ప్రజలను తిరస్కరించకుండా, సమస్య పరిష్కారంలో ముందుండి సహాయం చేసే వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. చిన్న చిన్న వ్యాపారుల మధ్య తలెత్తిన తగాదాలను సైతం సమర్థంగా పరిష్కరించడంలో ఆయన పాత్ర ప్రశంసనీయంగా ఉంది. మండలంలో యువకులు పెడదారిన పట్టకుండా ప్రతి గ్రామంలో చైతన్య కార్యక్రమాలు నిర్వహించి ఆదర్శంగా నిలిచారు
ఇలాంటి మంచి అధికారిపై ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కావాలనే కక్షపూరితంగా సృష్టించబడినవే తప్ప, ఆయనవద్ద ఎలాంటి తప్పు లేదని మండల ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకు కూడా ఈ పోలీస్ స్టేషన్లో ఇలాంటి ఘటనలు జరగడం గమనార్హం.
అందువల్ల, ఈ అంశంపై సమగ్రంగా విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని, నిర్దోషి అయిన ఎస్ఐ ప్రవీణ్ కుమార్ గారికి న్యాయం చేయాలని ధర్మసమాజ్ పార్టీ జిల్లా నాయకులు బొంకూరి రాజు ప్రభుత్వాన్ని కోరారు











