నిడమనూరు తహశీల్దార్ కార్యాలయంలో చలివేంద్రం ఏర్పాటు……
నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:18
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూరు మండలం కేంద్రంలోని
తాసీల్దార్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన
చలివేంద్రాన్ని తాసీల్దార్ జంగాల కృష్ణయ్య, మార్కెట్ చైర్మన్
అంకతి సత్యం, సర్పంచ్ శేషరాజు సంధ్యా శ్రీనివాస్ తో కలిసి
ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి
ఎండల తీవ్రత నేపథ్యంలో కార్యాలయానికి వచ్చే ప్రజల దాహార్తి
తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు
చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Post Views: 53











