*మున్సిపల్ చైర్ పర్సన్ చొరవతో రోడ్ ఎక్కిన రోడ్లు శుభ్రపరిచే యంత్రం*
*ప్రజా గొంతుక ఏప్రిల్ 20 డివిజన్ ప్రతినిధి సీరం దాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్లగొండ*
పట్టణంలోని ప్రధాన రహదారులను శుభ్రపరచడం కోసం మున్సిపాలిటీ నుండి కొనుగోలు చేసిన ( రోడ్లు శుభ్రపరిచే యంత్రం) సోమవారం మున్సిపల్ చైర్ పర్సన్ చొరవతో రోడ్ ఎక్కింది. ప్రధాన రహదారులను వేగంగా శుభ్రపరచడం కోసం దీనిని తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చామని మున్సిపల్ చైర్ పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు తెలిపారు. దీంతో మున్సిపల్ సిబ్బంది రోడ్లపై తగ్గిస్తూ ఇతర వార్డులో శుభ్రపరచడానికి ఏర్పాటు చేసినట్లు తెలిపారు .( రోడ్లు శుభ్రపరిచే యంత్రం ) ఏర్పాటు చేసి చెత్త సేకరణలోవేగవంతంగా పనులు చేపడతామని తెలిపారు .అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటూ పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దుతానని తెలిపారు .ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, మాజీ మున్సిపల్ సర్పంచ్ పున్న వెంకటేశ్వర్లు కమిషనర్ పూర్ణచందర్ శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్ గౌడ్ గుత్తే జవానులు పారిశుద్ధ కార్మికులు ఉన్నారు.











