ఆరోగ్య భీమా పథకం ను రైతులు వినియోగించుకోవాలి..

మన గ్రోమోర్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
మన గ్రామ సెంటర్ వారు అందించే, ఆరోగ్య భీమా పథకాలను అందరూ రైతు కుటుంబాలు ఉపయోగించుకోవాలని, కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మన గ్రోమోర్ సెంటర్స్ జనగామ జిల్లా ఏరియా మార్కెటింగ్ మేనేజర్ దర్శనం జానకయ్య అన్నారు.ఆరోగ్య బీమా పథకం లో భాగంగా సోమావారం నాడు బచ్చన్నపేట మండలంలోని తమ్మడపల్లి గ్రామంలో ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించినారు. డాక్టర్, మరియు వైద్య సిబ్బందిచే గ్రామములోని 52 మందికి బిపి, పల్స్ రేటును పరీక్షించి, దీర్ఘకాలిక వ్యాధులకు ఉచితంగా 23 రకాల మందులను పంపిణీ చేశారు. కావున రైతులందరూ కూడా మన గ్రోమోర్ సెంటర్లో లభించే ఆరోగ్య భీమాను తీసుకొని, సంవత్సరం పాటు, ఉచిత డాక్టర్ సంప్రదింపులు, 25రకాల మందులు, ప్రాథమిక పరీక్షలు, ప్రైవేటు ఆసుపత్రులలో డిస్కౌంట్ , ప్రమాద భీమా సదుపాయం కూడా పొందవచ్చు నని మన గ్రోమోర్ బచ్చన్నపేట మేనేజర్ బైరగోని ప్రషాంత్ తెలిపినారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ రాజు, గ్రామ సర్పంచ్ బేజాడి సిద్దులు,ఉప సర్పంచ్ నాగరాజు, రైతులు కాశిరెడ్డి మధు, బాలరాజు, బిక్షపతి, నారాయణ, నరసయ్య, భాస్కర్ మరియు గ్రామ మహిళా రైతులు పాల్గొన్నారు..











