E-PAPER

ఎల్కతుర్తి ఎంపీడీవోకు వినతి పత్రం అందజేత: ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఎల్కతుర్తి ఎంపీడీవోకు వినతి పత్రం అందజేత: ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్

21 Apr 2026, 5:47 pm DISHA POWER

ఎల్కతుర్తి ఎంపీడీవోకు వినతి పత్రం అందజేత: ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్

ప్రజా గొంతుక ఏప్రిల్ 21:ఎల్కతుర్తి :

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ఎల్కతుర్తి లో ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మడి రాజుల రాములు మంగళవారం ఎల్కతుర్తి ఎంపీడీవో విజయ్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రోజురోజుకూ బలహీనపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకురావాలని యోచిస్తున్న ‘విభజీ రామ్ బిల్లు’ను వెంటనే రద్దు చేసి, ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.కూలీలకు ఇబ్బందులు ఉపాధి హామీ కూలీలకు సకాలంలో వేతనాలు అందడం లేదని, పని ప్రదేశాల్లో మంచినీరు, నీడ, మెడికల్ కిట్ల వంటి కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఏటా బడ్జెట్‌లో కోతలు విధిస్తోందని ఆరోపించారు. ‘వి.బి.జి. రామ్’ పేరుతో కేంద్రం తీసుకురాబోయే కొత్త చట్టం వల్ల ఉపాధి హామీ కూలీలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. 2005లో ఎంతో పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికే కేంద్రం కుట్ర పన్నుతోందని విమర్శించారు. పని ప్రదేశాల్లో రోజుకు రెండుసార్లు ఫోటోలు తీసే విధానాన్ని రద్దు చేయాలని, ఒకసారి ఫోటో తీస్తే చాలని సూచించారు. ఫోటో రాకపోతే ఆ రోజు వేతనంలో కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి 200 రోజుల పని కల్పించి, కొలతలు లేకుండా రోజువారీ వేతనం రూ.600 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు ఇవ్వలేదని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు లోకిని స్వరూప, సుబ్రహ్మణ్యం రాధ, కరుణ, షణ్ముఖం, యాదగిరి, సర్కార్. అజ్మీర బిక్షపతి, మెట్టు సమ్మయ్య, రజిత కమిటీ సభ్యులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Generating image…

*ఎల్కతుర్తి ఎంపీడీవోకు వినతి పత్రం అందజేత: ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్*

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!