*బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.*
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి ( ప్రజా గొంతుక న్యూస్), 27 ఏప్రిల్ 2026.
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ కేసీఆర్ , పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , నర్సంపేట అభివృద్ధి ప్రదాత గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు,
*బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బాల్నే వెంకన్న.
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు బాల్నే వెంకన్న మాట్లాడుతూ ,
*కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ లేదు. అసలు బీఆర్ఎస్ పార్టీ అనేది లేకపోతే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రమే లేదని ,
బీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణ ప్రజల్లో ఒక గొప్ప ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది. నాటి ఉద్యమ చైతన్యాన్ని రగిల్చింది.
*తెలంగాణ సాధన కోసం నాలుగు కోట్ల ప్రజలను ఒక్క తాటి మీదకు తెచ్చి, ఉద్యమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకుపోయిన మహానాయకుడు కేసీఆర్ నాయకత్వంలో పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఈ శుభ సందర్భంగా ఉద్యమకారులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు, వారి కుటుంబ సభ్యులకు, ప్రజలందరికీ హృదయపూర్వక సిల్వర్ జూబ్లీ శుభాకాంక్షలు తెలియజేశారు.
బీఆర్ఎస్ పార్టీ పుట్టడం వల్లే ఇవాళ దశాబ్దాల తెలంగాణ కల సాకారమైంది.
బీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణ ప్రజల్లో ఒక గొప్ప ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది. నాటి ఉద్యమ చైతన్యాన్ని రగిల్చింది అని ఆయన అన్నారు.తెలంగాణ సాధన కోసం నాలుగు కోట్ల ప్రజలను ఒక్క తాటి మీదకు తెచ్చి, ఉద్యమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకుపోయిన మహానాయకుడు కేసీఆర్ అని ఆయన అన్నారు.కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆత్మ బలిదానాలు చేసుకున్న ఉద్యమకారులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది 25 ఏండ్లు పూర్తి అయ్యాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గా ప్రమాణం చేసి పదవీ బాధ్యతలను చేపట్టిన ఉద్యమనాయకుడు, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రజారంజాక పాలన అందించారని అన్నారు.అనేక ప్రజాసంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలు చేశారని చెప్పారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందని విమర్శించారు. రేవంత్ సర్కార్ పాలనతో ప్రజలు విసుగు చెందారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలంతా మళ్ళీ కేసీఆర్ పాలన కోసమే ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో గెలుపొంది బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమంలో: ,మండల ఎన్నికల కన్వీనర్ .మాజీ సొసైటీ చైర్మన్.మండల కార్యవర్గ సభ్యులు.మండల నాయకులు. సీనియర్ నాయకులు. పార్టీ నాయకులు. ప్రజా ప్రతినిధులు , మాజీ ప్రజా ప్రతినిధులు,సర్పంచులు, గ్రామ పార్టీ అధ్యక్షులు,వార్డు మెంబర్లు,యూత్ నాయకులు. కార్యకర్తలు, పార్టీ నాయకులు,ఉద్యమ నాయకులు,పార్టీ అభిమానులు ,పార్టీ శ్రేణులు తదితరులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.











