వడ్ల కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం…

కొనుగోలు కేంద్రంలో ఎక్కడికక్కడ నిలిచిపోయిన ధాన్యం…..
రైతులను పట్టించుకునే నాధుడే లేరా…
సర్పంచుల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
నెల రోజులుగా రైతులు వడ్లు కేంద్రాలకు తీసుకువస్తున్నప్పటికీ ధాన్యాన్ని ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క గింజ కూడా కొనలేదని మాజీ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఒక్కనాడు కూడా రైతుని ఇబ్బంది పెట్టిన రోజు లేదని గుర్తు చేశారు. కొనుగోలు కేంద్రాలలో వడ్లను తరలించి వారికి 48 గంటలలో డబ్బులు వేయడం జరిగిందని, ఏ ఒక్కరోజు రైతులను ఇబ్బందులకు గురి చేయలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వడ్ల కొనుగోలు కేంద్రాలలో ఎక్కడికక్కడ ధాన్యం నిలిచిపోయిందని, రైతులను పట్టించుకునే నాధుడు లేడని అన్నారు. వడ్లు కొంటే మద్దతు ధరతో పాటు బోనస్ ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కొనుగోళ్లు చేయడం లేదని ఆరోపించారు. ఒకవేళ వర్షం గనుక వస్తే ధాన్యం ఎక్కడికక్కడ తడిచిపోయి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని అన్నారు. మూడు రోజులలో కొనుగోలు కేంద్రాలలో నిలిచిపోయిన ధాన్యాన్ని తరలించకపోతే రైతులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి, చౌరస్తాలో రాస్తారోకో నిర్వహిస్తామని హెచ్చరించారు.











