అంగన్వాడీ టీచర్స్ కి ఫోర్ జి స్మార్ట్ ఫోన్లు పంపిణి చేసిన చైర్మెన్…… చింతల చంద్రారెడ్డి
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్:ఏప్రిల్:27
హాలియా మున్సిపల్ చైర్మెన్ చింతల చంద్రారెడ్డి చే అంగన్వాడీ టీచర్స్ కి ఫోర్ జి స్మార్ట్ ఫోన్లు పంపిణి అనుముల ప్రాజెక్టు హాలియా మున్సిపాలిటీ టీచర్స్ కి మున్సిపల్ కౌన్సిల్ హాల్లో మున్సిపల్ చైర్ పర్సన్ చంద్రారెడ్డి వైస్ చైర్ పర్సన్ రాజా రమేష్ , మున్సిపల్ వార్డు కౌన్సిలర్స్ సమక్షంలో అంగన్వాడి టీచర్స్ కు ఫోర్ జి స్మార్ట్ ఫోన్లు అందజేయడం జరిగినది సిడిపిఓ విజయలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్స్ ప్రతి ఒక్క బెనిఫిషరీస్ ని ఫోన్ ద్వారానే రిజిస్ట్రేషన్ మరియు 0 నుండి 6 పిల్లల బరువులు, అటెండెన్స్ ,ఫేస్ క్యాప్చర్స్ చేసి ఫుడ్ పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేసినారు, మున్సిపల్ చైర్ పర్సన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్స్ అందరూ ఫోన్స్ సద్వినియోగం చేసుకోవాలని అంగన్వాడీ టీచర్స్ చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ కే రమాదేవి అంగన్వాడీ టీచర్స్ పాల్గొనడం జరిగింది………..











