హలియా పురపాలక సంఘం లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ పై అవగాహన కార్యక్రమం…….
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:
హాలియా మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి అధ్యక్షతన హాలియా పురపాలక సంఘం కార్యాలయం నందు హాలియా పట్టణంలోని వివిధ వ్యాపార సంస్థల అసోసియేషన్ అధ్యక్షులతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.
ఇట్టి ఉద్దేశం హాలియా పట్టణంలోని షాపుల యజమానులు అందరూ కూడా తడి మరియు పొడి చెత్త ను వేరువేరుగా రెండు డబ్బాలను ఏర్పాటు చేసుకొని మున్సిపల్ వాహనానికి అందజేసి, బహిరంగ ప్రదేశాలలో చెత్తను వేయకుండా నిర్మూలించి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో తమ యొక్క పాత్రను పోషించాలని, అదే విధంగా హలియా పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని ఉద్దేశంతో హాలియా మున్సిపాలిటీలోని వ్యాపారస్తులు అందరూ మీ దగ్గర ఉన్నటువంటి ప్లాస్టిక్ కవర్లను ఈనెల 30 వ తారీకు తో కంప్లీట్ చేసి మే 1 వ తేదీ నుండి హాలియా పట్టణంలో ప్లాస్టిక్ ను నిషేధించాలని లేనియెడల తెలంగాణ మున్సిపాలిటీ చట్టo – 2019 మరియు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ప్రకారం రూ.5000/- వరకు జరిమానాలు విధించి మీ షాప్ యొక్క లైసెన్సు ను రద్దు చేయడం జరుగుతుందని సూచించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి మాట్లాడుతూ హలియా పట్టణంలో ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ప్లాస్టిక్ ను నిషేధించి, ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలని, అదేవిధంగా కేంద్ర గృహ మరియు పట్టణ మంత్రిత్వ శాఖ (మినిస్ట్రీ హౌసింగ్ housing అండ్ అర్బన్ అఫ్ఫైర్స్) చేపడుతున్న స్వచ్ఛ సర్వేక్షన్ 2025-26 సిటిజన్ ఫీడ్ బ్యాక్ లో మీ యొక్క విలువైన ఫీడ్ బ్యాక్ ఇచ్చి హాలియా అభివృద్ధికి సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గౌని రాజా రమేష్ , మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు కౌన్సిలర్ల సలహాదారులు, వివిధ వ్యాపార సంస్థల అసోసియేషన్ అధ్యక్షులు మరియు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ శశి కుమార్ , పర్యావరణ ఇంజనీర్ రవికుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ అంజయ్య,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.











