హాలియా మున్సిపాలిటీలో పదవీ విరమణ మరియు అభినందన సభ…….

నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:30
పురపాలక సంఘం హాలియా లో వార్డ్ ఆఫీసర్ మరియు జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న గాదె.వెంకట రామచంద్రరావు పదవి విరమణ కార్యక్రమం సాగర్ రోడ్డు లోని వైభవ్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి మాట్లాడుతూ వార్డ్ ఆఫీసర్ మరియు జూనియర్ అసిస్టెంట్ గా తన బాధ్యతను అంకితభావంతో, నిజాయితీతో,క్రమశిక్షణతో పని చేశారు.ఆయన చేసిన సేవలు మన మున్సిపాలిటీకి ఆదర్శప్రాయంగా నిలిచాయి సహోద్యోగులతో మంచి సంబంధాలు కలిగి ఉండటం ప్రతి పనిని బాధ్యతగా తీసుకొని పూర్తి చేయడం ఆయన ప్రత్యేకత అని చెప్పారు.
మున్సిపల్ కమిషనర్
ఆళ్ల.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ6 జీ.వి.ఆర్.రావు సేవలు కేవలం పనికే పరిమితం కాలేదు. కొత్తవారికి సహాయం చేయడం వంటి లక్షణాలు ఆయన వ్యక్తిత్వాన్ని మరింత గొప్పగా నిలబెట్టాయి. వారి యొక్క శేష జీవితం కూడా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
ఈ కార్యక్రమంలో 6 వ వార్డు కౌన్సిలర్ బొంగరాల యేసురాజు ,9 వ వార్డు కౌన్సిలర్ చేరుపల్లి ముత్యాలు ,2 వ వార్డు కౌన్సిలర్ సలహాదారు నకిరేకంటి సైదులు ,5 వ వార్డు కౌన్సిలర్ సలహాదారు చిట్టిపోలు కరుణాసాగర్ ,8 వ వార్డు కౌన్సిలర్ సలహాదారు మజార్ మొయినుద్దీన్ ,12 వ వార్డు కౌన్సిలర్ సలహాదారు ఎడవల్లి రంజిత్ కోఆప్షన్ సభ్యులు కొమ్మనబోయిన జయమ్మ అనుముల మండల ఎమ్మార్వో , ఎంపీడీవో, హాలియా మున్సిపల్ సిబ్బంది, కుటుంబ సభ్యులు ,బంధు మిత్రులు పాల్గొన్నారు.











