పదవ తరగతి ఫలితాలలో విజయఢంకా మోగించిన టైమ్ స్కూల్ విద్యార్థులు…..

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:30
2025–26 విద్యా సంవత్సర 10వ తరగతి ఫలితాలు – విజయ ఢంకా మోగించిన టైమ్ స్కూల్ విద్యార్థులు
హాలియా పట్టణంలోని టైమ్ స్కూల్ విద్యార్థులు 2025–2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన 10వ తరగతి పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. పాఠశాల వందకి వంద శాతం ఉత్తీర్ణత సాధించి విశిష్ట విజయాన్ని నమోదు చేసింది.
ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో ప్రతిభను చాటుకున్నారు.
కే. మహాలక్ష్మి 576 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచింది.
పీ. మోహనా నగాంజలి 569 మార్కులు, ఎన్. చైతన్ సిద్ధార్థ్ 568 మార్కులు సాధించి తరువాతి స్థానాల్లో నిలిచారు.
ఇతర ప్రతిభావంతుల వివరాలు ఇలా ఉన్నాయి:
ఎన్. మనితేజ 567, ఎం. భార్గవి 565, కె. సాత్విన్ రెడ్డి 565,
కె. జగదీశ్వరి 563, ఎస్. కార్తిక్ 559, బి. దీక్షిత్ కుమార్ 554,
కె. ఐశ్వర్య 551, ఎన్. ఆకాశ్ 550, చ. సురేందర్ రెడ్డి 550 మార్కులు సాధించారు.
ఈ విజయంపై పాఠశాల నిర్వహణ, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ, విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల సహకారం మరియు ఉపాధ్యాయుల మార్గదర్శకత్వమే ఈ విజయానికి కారణమని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను వారి తల్లిదండ్రులతో కలిసి పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్లు మందా నరేందర్ రెడ్డి మరియు కత్తి కోటి రెడ్డి పాల్గొని విద్యార్థులను అభినందించారు.
ఇదే సమయంలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమయ్యాయని పాఠశాల వర్గాలు తెలియజేశాయి.











