నిడమానూరు కోర్టు దారికి 20 లక్షలు మంజూరు చేస్తానని హామీ……
ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి 
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:06
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూరు పట్టణ అభివృద్ధి లో భాగంగా సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఏర్పాటు కు ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు చేసి హైకోర్టు కు పంపి వెంటనే కోర్టు ఏర్పాటు కు తగిన చర్యలు తీసుకోవాలని నాగార్జునసాగర్ శాసన సభ్యులు కుందూరు జై వీర్ రెడ్డి ని స్థానిక న్యాయవాదులు ఉన్నం సత్యనారాయణ, బొల్లం శ్రీనివాస్ యాదవ్ మరియు పొదిళ్ళ శ్రీనివాస్ లు కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా నిడమనూరు కాంగ్రెస్ పార్టీ దిమ్మ నుండి కోర్టు వరకు సి సి రోడ్డు ఏర్పాటు కు చర్యలు తీసుకోవాలని కోరటం తో ఎమ్మెల్యే వెంటనే స్పందించి సి సి రోడ్డు కు 20 లక్షలు మంజూరు చేస్తానని, సబ్ కోర్టు ఏర్పాటు కు సీఎం తో మాట్లాడి సబ్ కోర్టు ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. దీనికి ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి కి నాగార్జునసాగర్ నియోజకవర్గ మరియు నిడమనూరు పట్టణ ప్రజల తరుపున న్యాయవాదులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేయటం జరిగింది.











