సరస్వతి పుత్రుడిని సన్మానించిన ఏ కే ఫౌండేషన్ చైర్మన్…..
హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్……..
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:15నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం అనుముల మండలం యాచారం గ్రామానికి చెందిన రైతు బుర్రి కృష్ణ -జ్యోతి యొక్క కుమారుడు బుర్రి సందీప్ యాచారం ప్రభుత్వ పాఠశాల లో విద్యనభ్యసించి ఇటీవల వెలువడిన పదవ తరగతి ఫలితాలలో 538 మార్కులు సాధించి అనుముల మండల టాపర్ గా నిలువడం జరిగింది. ఈ సందర్భంగా ఏ కే ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్ గ్రామానికి విచ్చేసి బుర్రి సందీప్ ని అభినందించి శాలువతో సన్మానించి, టోకెన్ అఫ్ అప్ప్రెసియేషన్ కింద నగదు పారితోషికాన్ని అందజేసీ,ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ చిన్న రైతు కుటుంబం లో పుట్టి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ మండలం లోనే ఉత్తమ మార్కులు తెచ్చుకొని కన్న తల్లిదండ్రుల,చదువు చెప్పిన ఉపాధ్యాయుల, పుట్టిన ఊరు కి పేరు తెచ్చిన బుర్రి సందీప్ ని ప్రత్యేక అభినందనలు తెలిపి, భవిష్యత్ లో మరింత కష్టపడి చదివి ఐఏఎస్ అవ్వాలన్న తన ఆశయాన్ని నెరవేర్చుకోవాలని అభిలాషించారు.ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ బుర్రి ముత్తయ్య యాదవ్, మండల కాంగ్రెస్ నాయకులు కట్టెబోయిన మల్లేష్ యాదవ్,శీలం శేఖర్, నడ్డి సైదులు, కట్టెబోయిన సైదులు, రవి, శంకర్, కాంసాని పెద్ద నాగయ్య యాదవ్, కాంసాని అంజయ్య, పుట్ట విజయ్ ముదిరాజ్, మన్నెంకోటి, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు











