శ్రీ శివ నాగ స్వామి మానవ సేవ
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సింగసముద్రంలో తెల్లవారుజాము సమయంలో ఇర్ఫాదర్మరాజు ఇల్లు షార్ట్ సర్క్యూట్ తో నిప్పు అంటుకొని ఇల్లు దగ్ధమైనఘటన చోటుచేసుకుంది.వీరు పూర్తిగా నిరుపేద కుటుంబం కావడంతో ఆర్థికంగా కుటుంబం నష్టపోవడం జరిగిందని స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ మహాక్షేత్ర చిన్నఅరుణాచలం వ్యవస్థాపకులు అరుణాచలేశ్వర ట్రస్ట్ తరఫున శ్రీ శివనాగస్వామి 50 కేజీల బియ్యం,దుస్తులు కూరగాయలు 4000 విలువచేసే వస్తువులు వితరణ చేశారు.ఈ సందర్భంగా శివ నాగ స్వామి మాట్లాడుతూ రెండు మండలాల్లో నిరుపేదలకు ఏ కష్టం వచ్చినా తన సహాయ సహకారాలు అందిస్తానన్నారు.ఈ సందర్భంగా ప్రజలు శ్రీ శివ నాగ స్వామిని ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో అర్చకులు నవీన్ రెడ్డి.మచ్చ వీర్రాజు.దేవయ్య.తదితరులు పాల్గొన్నారు.











