*మహేశ్వరం పరిధిలో వ్యక్తి అదృశ్యం*
*(ప్రజా గొంతుక మహేశ్వరం మే 16:)*రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎప్పలపల్లి రవీందర్ రెడ్డి (53) అనే వ్యక్తి కనిపించకుండా పోయినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం, మహేశ్వరం గ్రామానికి చెందిన రవీందర్ రెడ్డి గత కొంతకాలంగా మనస్థాపానికి గురై ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఈ నెల *10.05.2026 సాయంత్రం సుమారు 5:00 గంటల ప్రాంతంలో* రవీందర్ రెడ్డి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. రాత్రి 10:00 గంటలైనా ఆయన తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అనంతరం ఆయన మొబైల్ ఫోన్కు కాల్ చేయగా, ఫోన్ ఇంట్లోనే మరిచిపోయి వెళ్లినట్లు గుర్తించారు.ఆ రోజంతా బంధువులు, స్నేహితుల ఇళ్లలో మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఆయన ఆచూకీ లభించలేదు. దీంతో గురువారం (14.05.2026) రవీందర్ రెడ్డి కుమారుడు ఎప్పలపల్లి ఉదయ్ రెడ్డి (26) మహేశ్వరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.తప్పిపోయిన వ్యక్తి గుర్తులు:* *పేరు:* ఎప్పలపల్లి రవీందర్ రెడ్డి* *వయస్సు:* 53 సంవత్సరాలు* *వృత్తి:* వ్యవసాయం* *ఎత్తు:* 5.6 అడుగులు* *రూపురేఖలు:* తెల్లని రంగు భాష: తెలుగు మాట్లాడగలరు *దుస్తులు:* చొక్కా మరియు ప్యాంటు*విజ్ఞప్తి:* పై గుర్తులు గల వ్యక్తి ఎవరికైనా కనిపిస్తే లేదా సమాచారం తెలిసినా వెంటనే కింది నంబర్లకు సమాచారం ఇవ్వాలని మహేశ్వరం పోలీసులుకోరుతున్నారు.సంప్రదించవలసిన నంబర్లు:*ఫిర్యాదుదారుడు ఉదయ్ రెడ్డి: 9885770881 మహేశ్వరం PS: 8712662684 ఇన్స్పెక్టర్: 8712662368 ఎస్ఐ: 8712662404*











