మరణించిన మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సహాయం….
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:18నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూరు : మండల కేంద్రానికి చెందిన అట్టెం నరేందర్ ఇటీవల రోడ్డు ప్రమాదం లో మృతి చెందాడు. కాగా అతడితో పాటు నిడమనూరు జిల్లా పరిషత్ హైస్కూల్ లో 1992-93 విద్యా సంవత్సరం లో పదో తరగతి చదివిన మిత్రులు నరేందర్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. మిత్రులందరు కలిసి రూ.1,22,000 సేకరించి నరేందర్ కుమారుడు అభిరాం పేరిట పోస్టాఫీస్ లో ఫిక్స్ డ్ డిపాజిట్ చేసి ఆదివారం బాధిత కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో బొల్లం శ్రీనివాస్ యాదవ్, పాంపాటి ఆంజనేయులు, గుమ్మడవెల్లి సాయిబాబు,కర్నాటి శ్రీనుకుమార్, జినుకుంట్ల శ్రీనివాస్, కే. నవీన్,షేక్ సైదులు, రావిరాల శ్రీను, కొట్ర వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 129











