ఘనంగా పుచ్చల పల్లి సుందరయ్య వర్ధంతి
ప్రజా గొంతుక మే 19 డివిజన్ ప్రతినిధి సిరం దాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండదక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, ఆదర్శ నాయకులు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతిని దేవరకొండ మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా *సిపిఎం దేవరకొండ మండల కార్యదర్శి నల్లా వెంకటయ్య* మాట్లాడుతూ ఆదర్శవంతమైన విలువలతో రాజకీయాలు చేయడం కమ్యూనిస్టులకే సాధ్యమని దీనికి సుందరయ్య జీవితమే ఆదర్శమని అన్నారు.భూస్వామ్య కుటుంబంలో పుట్టినప్పటికీ భూస్వామ్య పెత్తందారి విధానాలకు వ్యతిరేకంగా చిన్ననాటి నుండే పోరాటం చేసిన మహా నాయకుడిని అన్నారు.తెలంగాణలో భూస్వామ్య జమీందారీ రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం సాగించడంలో కీలకపాత్ర వహించారని, వ్యవసాయ కార్మికులకు కూలీ పెరగాలని,భూమి పంచాలని సంఘం సంఘం పెట్టి కూలి భూమి పోరాటాలు చేశారని వారు అన్నారు. డబ్బు, కులం, మతం, కార్పొరేట్ ప్రభావం రాజకీయాలను శాసిస్తున్న ఈ కాలంలో సుందరయ్యలాంటి నాయకుల అవసరం మరింత పెరిగింది. రాజకీయాలు సేవ నుంచి వ్యాపారంగా మారుతున్న వేళ ఆయన జీవితం యువతకు ఒక పాఠశాల కావాలి. యువత ఉద్యోగాలకే పరిమితం కాకూడదని. సమాజం కోసం ఆలోచించాలని.అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ధైర్యం కలిగి ఉండాలని కుల, మత విద్వేషాలకు అతీతంగా మానవత్వం కోసం నిలబడాలని అన్నారు.ప్రజల సమస్యలను తమ సమస్యలుగా భావించే కొత్త నాయకత్వం సమాజానికి అవసరమని సుందరయ్య యువతకు ఇచ్చిన సందేశం ఒక్కటే ‘రాజకీయాలు అంటే అధికారం కాదు- బాధ్యత. నాయకత్వం అంటే ప్రచారం కాదు ప్రజల కోసం నిలబడటం. ప్రజాసేవ అంటే మాటలు కాదు త్యాగం”. సుందరయ్యను కేవలం జయంతులు, వర్ధంతులకు పరిమితం చేస్తే సరిపోదు. ఆయన కలలు కన్న సమసమాజ నిర్మాణం కోసం కృషి చేయడమే నిజమైన నివాళి. అన్నారు ప్రజల పక్షాన నిలబడటం.. ప్రజా పోరాటాల్లో భాగమవడం.. సామాజిక న్యాయం కోసం నడవడం.. యువత బాధ్యతగా తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో *సిపిఎం మండల కమిటీ ఎం పర్వత రెడ్డి, బిజిలి లింగయ్య,ఎం డి రహీం,పి.జ్యోతి,బుడిగ వెంకటేష్,నల్లా రామస్వామి, తదితరులు పాల్గొన్నారు











