E-PAPER

గిరిజన బంజారా నాయకుల అక్రమ అరెస్టు ప్రజాస్వామ్య విరుద్ధం

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

గిరిజన బంజారా నాయకుల అక్రమ అరెస్టు ప్రజాస్వామ్య విరుద్ధం

19 May 2026, 5:09 pm DISHA POWER

గిరిజన బంజారా నాయకుల అక్రమ అరెస్టు ప్రజాస్వామ్య విరుద్ధం

-- ఎల్‌హెచ్‌పీఎస్,ఎల్‌ఎస్‌పీఎస్ నేతల తీవ్ర ఆగ్రహం

-- ఎన్నికల సమయంలో ఇచ్చిన డిక్లరేషన్ హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి

ప్రజాగొంతుక ప్రతినిధి/జనగామ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి పిలుపు నేపథ్యంలో జనగామ జిల్లాలో గిరిజన బంజారా సంఘాల ముఖ్య నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఎల్‌ఎస్‌పీఎస్ జిల్లా ఇన్‌చార్జి,జీవీఎస్ జిల్లా అధ్యక్షులు కొర్ర రాజేందర్ నాయక్ తీవ్రంగా ఖండించారు.ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాలరాయడం దుర్మార్గమైన చర్య అని ఆయన మండిపడ్డారు.ఈ సందర్భంగా రాజేందర్ నాయక్ మాట్లాడుతూ... ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజ్మీరా స్వామి నాయక్, సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్, ఎల్‌ఎస్‌పీఎస్ జిల్లా నాయకులు వినోద్,శ్యామ్, జంపన్నలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.పోలీసులను అడ్డుపెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను,నిరంకుశ వైఖరిని లంబాడ గిరిజన సమాజం గమనిస్తోందని ఆయన హెచ్చరించారు.ప్రజల సమస్యలపై ప్రశ్నించే నాయకులను నిర్బంధించినంత మాత్రాన హక్కుల పోరాటాలను అడ్డుకోలేరని స్పష్టం చేశారు.

డిక్లరేషన్ హామీలను అమలు చేయాలి:

ఎన్నికల సమయంలో గిరిజన బంజారా సమాజానికి ఇచ్చిన డిక్లరేషన్ హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.లంబాడ గిరిజన సంఘాలను, ప్రజలను మోసం చేస్తే సహించేది లేదని, ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమం ఆగదని, మరింత ఉధృతంగా పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు.

ప్రశ్నించే హక్కును అణచలేరు — అజ్మీరా స్వామి నాయక్:

ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజ్మీరా స్వామి నాయక్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, ఉద్యమాలను అణచివేయడానికి పోలీసులను ఉపయోగించడం సరికాదన్నారు.ప్రభుత్వం వెంటనే గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి,అక్రమ అరెస్టుల రాజకీయాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు.అక్రమ అరెస్టులతో ఉద్యమ స్వరాన్ని అణచివేయాలని చూసినా భయపడేది లేదని,హక్కుల సాధన కోసం మరింత తీవ్రంగా ఉద్యమిస్తామని నాయకులు స్పష్టం చేశారు.

Generating image…

గిరిజన బంజారా నాయకుల అక్రమ అరెస్టు ప్రజాస్వామ్య విరుద్ధం

— ఎల్‌హెచ్‌పీఎస్,ఎల్‌ఎస్‌పీఎస్ నేతల తీవ్ర ఆగ్రహం

— ఎన్నికల సమయంలో ఇచ్చిన డిక్లరేషన్ హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి

ప్రజాగొంతుక ప్రతినిధి/జనగామ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి పిలుపు నేపథ్యంలో జనగామ జిల్లాలో గిరిజన బంజారా సంఘాల ముఖ్య నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఎల్‌ఎస్‌పీఎస్ జిల్లా ఇన్‌చార్జి,జీవీఎస్ జిల్లా అధ్యక్షులు కొర్ర రాజేందర్ నాయక్ తీవ్రంగా ఖండించారు.ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాలరాయడం దుర్మార్గమైన చర్య అని ఆయన మండిపడ్డారు.ఈ సందర్భంగా రాజేందర్ నాయక్ మాట్లాడుతూ… ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజ్మీరా స్వామి నాయక్, సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్, ఎల్‌ఎస్‌పీఎస్ జిల్లా నాయకులు వినోద్,శ్యామ్, జంపన్నలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.పోలీసులను అడ్డుపెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను,నిరంకుశ వైఖరిని లంబాడ గిరిజన సమాజం గమనిస్తోందని ఆయన హెచ్చరించారు.ప్రజల సమస్యలపై ప్రశ్నించే నాయకులను నిర్బంధించినంత మాత్రాన హక్కుల పోరాటాలను అడ్డుకోలేరని స్పష్టం చేశారు.

డిక్లరేషన్ హామీలను అమలు చేయాలి:

ఎన్నికల సమయంలో గిరిజన బంజారా సమాజానికి ఇచ్చిన డిక్లరేషన్ హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.లంబాడ గిరిజన సంఘాలను, ప్రజలను మోసం చేస్తే సహించేది లేదని, ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమం ఆగదని, మరింత ఉధృతంగా పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు.

ప్రశ్నించే హక్కును అణచలేరు — అజ్మీరా స్వామి నాయక్:

ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజ్మీరా స్వామి నాయక్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, ఉద్యమాలను అణచివేయడానికి పోలీసులను ఉపయోగించడం సరికాదన్నారు.ప్రభుత్వం వెంటనే గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి,అక్రమ అరెస్టుల రాజకీయాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు.అక్రమ అరెస్టులతో ఉద్యమ స్వరాన్ని అణచివేయాలని చూసినా భయపడేది లేదని,హక్కుల సాధన కోసం మరింత తీవ్రంగా ఉద్యమిస్తామని నాయకులు స్పష్టం చేశారు.

RaamSee Reporter
dishapower.in

గిరిజన బంజారా నాయకుల అక్రమ అరెస్టు ప్రజాస్వామ్య విరుద్ధం

గిరిజన బంజారా నాయకుల అక్రమ అరెస్టు ప్రజాస్వామ్య విరుద్ధం

-- ఎల్‌హెచ్‌పీఎస్,ఎల్‌ఎస్‌పీఎస్ నేతల తీవ్ర ఆగ్రహం

-- ఎన్నికల సమయంలో ఇచ్చిన డిక్లరేషన్ హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి

ప్రజాగొంతుక ప్రతినిధి/జనగామ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి పిలుపు నేపథ్యంలో జనగామ జిల్లాలో గిరిజన బంజారా సంఘాల ముఖ్య నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఎల్‌ఎస్‌పీఎస్ జిల్లా ఇన్‌చార్జి,జీవీఎస్ జిల్లా అధ్యక్షులు కొర్ర రాజేందర్ నాయక్ తీవ్రంగా ఖండించారు.ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాలరాయడం దుర్మార్గమైన చర్య అని ఆయన మండిపడ్డారు.ఈ సందర్భంగా రాజేందర్ నాయక్ మాట్లాడుతూ... ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజ్మీరా స్వామి నాయక్, సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్, ఎల్‌ఎస్‌పీఎస్ జిల్లా నాయకులు వినోద్,శ్యామ్, జంపన్నలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.పోలీసులను అడ్డుపెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను,నిరంకుశ వైఖరిని లంబాడ గిరిజన సమాజం గమనిస్తోందని ఆయన హెచ్చరించారు.ప్రజల సమస్యలపై ప్రశ్నించే నాయకులను నిర్బంధించినంత మాత్రాన హక్కుల పోరాటాలను అడ్డుకోలేరని స్పష్టం చేశారు.

డిక్లరేషన్ హామీలను అమలు చేయాలి:

ఎన్నికల సమయంలో గిరిజన బంజారా సమాజానికి ఇచ్చిన డిక్లరేషన్ హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.లంబాడ గిరిజన సంఘాలను, ప్రజలను మోసం చేస్తే సహించేది లేదని, ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమం ఆగదని, మరింత ఉధృతంగా పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు.

ప్రశ్నించే హక్కును అణచలేరు — అజ్మీరా స్వామి నాయక్:

ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజ్మీరా స్వామి నాయక్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, ఉద్యమాలను అణచివేయడానికి పోలీసులను ఉపయోగించడం సరికాదన్నారు.ప్రభుత్వం వెంటనే గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి,అక్రమ అరెస్టుల రాజకీయాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు.అక్రమ అరెస్టులతో ఉద్యమ స్వరాన్ని అణచివేయాలని చూసినా భయపడేది లేదని,హక్కుల సాధన కోసం మరింత తీవ్రంగా ఉద్యమిస్తామని నాయకులు స్పష్టం చేశారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!