E-PAPER

పొడుస్తున్న LED లైట్లు – నరకంగా మారుతున్న రాత్రి ప్రయాణం!

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

పొడుస్తున్న LED లైట్లు – నరకంగా మారుతున్న రాత్రి ప్రయాణం!

20 May 2026, 12:43 pm DISHA POWER

పొడుస్తున్న LED లైట్లు – నరకంగా మారుతున్న రాత్రి ప్రయాణం!

మన సాక్షి గొంతుక ప్రతినిధి/జనగామ:రాత్రి వేళల్లో రహదారి ప్రయాణం రోజురోజుకూ నరకప్రాయంగా మారుతోందని జనగామ అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంతెన మణి కుమార్ అన్నారు.ఒక ప్రకటనలో వారు మాట్లాడుతూ ఇందుకు ప్రధాన కారణం కొత్తగా వస్తున్న వాహనాలకు అమర్చుతున్న విపరీతమైన కాంతివంతమైన ఎల్ఈడి (LED) హెడ్‌లైట్లు.రాత్రి 7 గంటల తర్వాత రోడ్డుపైకి రావాలంటేనే సామాన్య వాహనదారులు,ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.ఎదురుగా వచ్చే వాహనాల హై-బీమ్ (High-beam) LED లైట్ల తీవ్రత వల్ల కళ్ళు మసకబారి, కొన్ని సెకన్ల పాటు రోడ్డు అస్సలు కనిపించడం లేదు. ఈ "తాత్కాలిక అంధత్వం" (Temporary Blindness) వల్ల బైకులు అదుపు తప్పి కింద పడటం,డివైడర్లను ఢీకొట్టడం వంటి ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి.గతంలో వాహనాల హెడ్‌లైట్‌పై సగం వరకు బ్లాక్ స్టిక్కర్ లేదా బ్లాక్ పెయింట్ వేయాలనే నిబంధన ఉండేది. దీనివల్ల కాంతి నేరుగా ఎదుటివారి కళ్ళపై పడకుండా రోడ్డుపైకి ప్రసరించేది.కానీ ప్రస్తుతం ఆ నిబంధన ఎక్కడా అమలులో ఉన్నట్లు కనిపించడం లేదు.మార్కెట్లో దొరికే అత్యధిక వాటేజ్ గల అదనపు LED లైట్లను ఇష్టానుసారంగా అమర్చుకుంటున్నా ఆర్టీవో (RTO) అధికారుల పర్యవేక్షణ,నియంత్రణ లోపించాయి.కాబట్టి, రవాణా శాఖ అధికారులు తక్షణమే స్పందించి,పాత 'బ్లాక్ స్టిక్కర్' నిబంధనను కఠినంగా అమలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై భారీ జరిమానాలు విధించాలని కోరుతున్నాము.ప్రాణాలు పోయాక స్పందించడం కంటే, ప్రమాదాలు జరగకుండా ముందే అరికట్టాలని 'అమ్మ ఫౌండేషన్' తరఫున విజ్ఞప్తి చేశారు.

Generating image…

పొడుస్తున్న LED లైట్లు – నరకంగా మారుతున్న రాత్రి ప్రయాణం!

మన సాక్షి గొంతుక ప్రతినిధి/జనగామ:రాత్రి వేళల్లో రహదారి ప్రయాణం రోజురోజుకూ నరకప్రాయంగా మారుతోందని జనగామ అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంతెన మణి కుమార్ అన్నారు.ఒక ప్రకటనలో వారు మాట్లాడుతూ ఇందుకు ప్రధాన కారణం కొత్తగా వస్తున్న వాహనాలకు అమర్చుతున్న విపరీతమైన కాంతివంతమైన ఎల్ఈడి (LED) హెడ్‌లైట్లు.రాత్రి 7 గంటల తర్వాత రోడ్డుపైకి రావాలంటేనే సామాన్య వాహనదారులు,ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.ఎదురుగా వచ్చే వాహనాల హై-బీమ్ (High-beam) LED లైట్ల తీవ్రత వల్ల కళ్ళు మసకబారి, కొన్ని సెకన్ల పాటు రోడ్డు అస్సలు కనిపించడం లేదు. ఈ “తాత్కాలిక అంధత్వం” (Temporary Blindness) వల్ల బైకులు అదుపు తప్పి కింద పడటం,డివైడర్లను ఢీకొట్టడం వంటి ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి.గతంలో వాహనాల హెడ్‌లైట్‌పై సగం వరకు బ్లాక్ స్టిక్కర్ లేదా బ్లాక్ పెయింట్ వేయాలనే నిబంధన ఉండేది. దీనివల్ల కాంతి నేరుగా ఎదుటివారి కళ్ళపై పడకుండా రోడ్డుపైకి ప్రసరించేది.కానీ ప్రస్తుతం ఆ నిబంధన ఎక్కడా అమలులో ఉన్నట్లు కనిపించడం లేదు.మార్కెట్లో దొరికే అత్యధిక వాటేజ్ గల అదనపు LED లైట్లను ఇష్టానుసారంగా అమర్చుకుంటున్నా ఆర్టీవో (RTO) అధికారుల పర్యవేక్షణ,నియంత్రణ లోపించాయి.కాబట్టి, రవాణా శాఖ అధికారులు తక్షణమే స్పందించి,పాత ‘బ్లాక్ స్టిక్కర్’ నిబంధనను కఠినంగా అమలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై భారీ జరిమానాలు విధించాలని కోరుతున్నాము.ప్రాణాలు పోయాక స్పందించడం కంటే, ప్రమాదాలు జరగకుండా ముందే అరికట్టాలని ‘అమ్మ ఫౌండేషన్’ తరఫున విజ్ఞప్తి చేశారు.

RaamSee Reporter
dishapower.in

పొడుస్తున్న LED లైట్లు – నరకంగా మారుతున్న రాత్రి ప్రయాణం!

పొడుస్తున్న LED లైట్లు – నరకంగా మారుతున్న రాత్రి ప్రయాణం!

మన సాక్షి గొంతుక ప్రతినిధి/జనగామ:రాత్రి వేళల్లో రహదారి ప్రయాణం రోజురోజుకూ నరకప్రాయంగా మారుతోందని జనగామ అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంతెన మణి కుమార్ అన్నారు.ఒక ప్రకటనలో వారు మాట్లాడుతూ ఇందుకు ప్రధాన కారణం కొత్తగా వస్తున్న వాహనాలకు అమర్చుతున్న విపరీతమైన కాంతివంతమైన ఎల్ఈడి (LED) హెడ్‌లైట్లు.రాత్రి 7 గంటల తర్వాత రోడ్డుపైకి రావాలంటేనే సామాన్య వాహనదారులు,ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.ఎదురుగా వచ్చే వాహనాల హై-బీమ్ (High-beam) LED లైట్ల తీవ్రత వల్ల కళ్ళు మసకబారి, కొన్ని సెకన్ల పాటు రోడ్డు అస్సలు కనిపించడం లేదు. ఈ "తాత్కాలిక అంధత్వం" (Temporary Blindness) వల్ల బైకులు అదుపు తప్పి కింద పడటం,డివైడర్లను ఢీకొట్టడం వంటి ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి.గతంలో వాహనాల హెడ్‌లైట్‌పై సగం వరకు బ్లాక్ స్టిక్కర్ లేదా బ్లాక్ పెయింట్ వేయాలనే నిబంధన ఉండేది. దీనివల్ల కాంతి నేరుగా ఎదుటివారి కళ్ళపై పడకుండా రోడ్డుపైకి ప్రసరించేది.కానీ ప్రస్తుతం ఆ నిబంధన ఎక్కడా అమలులో ఉన్నట్లు కనిపించడం లేదు.మార్కెట్లో దొరికే అత్యధిక వాటేజ్ గల అదనపు LED లైట్లను ఇష్టానుసారంగా అమర్చుకుంటున్నా ఆర్టీవో (RTO) అధికారుల పర్యవేక్షణ,నియంత్రణ లోపించాయి.కాబట్టి, రవాణా శాఖ అధికారులు తక్షణమే స్పందించి,పాత 'బ్లాక్ స్టిక్కర్' నిబంధనను కఠినంగా అమలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై భారీ జరిమానాలు విధించాలని కోరుతున్నాము.ప్రాణాలు పోయాక స్పందించడం కంటే, ప్రమాదాలు జరగకుండా ముందే అరికట్టాలని 'అమ్మ ఫౌండేషన్' తరఫున విజ్ఞప్తి చేశారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!