గుర్తుతెలియని వ్యక్తులు వరి కొయ్యలకు నిప్పు…రైతు పొలం దగ్ధం, 500 తాటి చెట్లు కాలిపోయాయి…
ప్రజా గొంతుక (మే 21) కాల్వ శ్రీరాంపూర్ :మండలంలోని మీర్జంపేట గ్రామంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వరి కొయ్యలకు నిప్పు అంటించడంతో ఆ గ్రామం చుట్టూ మంటలు వ్యాపించడంతో ఊరు మొత్తం పొగ తో కామ్మేసింది.. గౌడ్ అన్నలు జీవనోపాధి భావించే సుమారు 500తాటి చెట్లు కాలిపోయాయి. అదే గ్రామానికి చెందిన పుల్లూరి సాగర్ అనే ఒక ఎకరం నర పొలం, ఆ మంటలకు పూర్తిగా ఖాళీ బూడిద అయిందని రైతు ఆందోళన చెందుతున్నాడు ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని సాగరు వేడుకుంటున్నాడు… ఆ గ్రామంలోని రైతులు వరి వ్యవసాయ క్షేత్రలకు వెళ్లి, పైపులు మోటార్లు కొందరు జాగ్రత్త పరుచుకున్న కొందరివి కాళీ బూడిద అయిపోయాయి. ప్రభుత్వం అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టపోయిన రైతులకు ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు… సంఘటన స్థలానికి ఫైర్ ఇంజన్ చేరుకొని మంటలు కొంతమేర మంటలను చల్లార్చినట్టు గ్రామస్తులు తెలిపారు… ఊరు చుట్టూ మంటలు అంటుకోవడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు…











