ఉపాధి హామీ కూలీలకు పనిముట్లు ఇవ్వాలి………..
నారి ఐలయ్య
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:21
ఉపాధి హామీ లో పనిచేస్తున్న కూలీలకు ప్రభుత్వమే పనిముట్లు ఇవ్వాలనివ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారీ ఐలయ్య
ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని నారమ్మగూడెం గ్రామం లో ఉపాధి హామీ పనిచేస్తున్న ప్రదేశాన్ని సందర్శించి కూలీలతో ఆయన మాట్లాడారు. గతంలో ప్రభుత్వమే వంద శాతం నిధులు కేటాయించి కూలీలకు తట్టా పారా గడ్డపార పనిముట్లను అందించిందని నేడు అవేవీ లేకుండా పని చేయించడం సరైనది కాదని ఆయన అన్నారు. రాష్ట్రాలపై భారాలు మోపుతూ కూలీలను ఈ పథకానికి దూరం చేసి ఉపాధమిని నిర్వీర్యం చేసి ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం చేస్తుందని ఆయన అన్నారు. రెండు పూటలా ఫోటో విధానంతో కూలీలు నష్టపోతున్నారని వెంటనే ఎత్తివేయాలని వీబీజీ రామ్ జి స్కీమును ఉపసంహరించుకొని పాత పద్ధతిలో ఉపాది హామీ ని కొనసాగించాలని,కనీస వేతనం అమలు చేయాలని, సంవత్సరానికి 200 రోజులు పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కార్మికుల సమస్యలు పరిష్కారానికి సంఘం పోరాడుతుందని అన్నారు. అనంతరం గ్రామ నూతన కమిటీని ఎన్నుకున్నారు.అధ్యక్ష కార్యదర్శులుగా మంచి కంటి రుక్మిణమ్మ, మాతంగి రామకృష్ణ, సహయ కార్యదర్శి గా పాకాల అన్నపూర్ణ, ఉపాధ్యక్షుడిగా రావుల శ్రీను, కోశాధికారిగా చేయవండి మల్లేష్ యాదవ్ ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో కేవీపీస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కందుకూరి కోటేష్, నల్లబోతు సోమయ్య, ఎక్కలూరి గోవర్ధన్ రెడ్డి, మన్నె ముత్తమ్మ, కోట రాజు, వడ్డే కొండలు, పోలే చిరంజీవి, గడ్డం రామకృష్ణారెడ్డి, మందటి శ్రీనివాస్ రెడ్డి, కాసిరెడ్డి కోటమ్మ, పాకాల సైదులు, నీరుడు కలమ్మ తదితరులు పాల్గొన్నారు











