ఆ ఊరికి రెండు పేర్లు… ప్రజల్లో గందరగోళ పరిస్థితులు…కాల్వ శ్రీరాంపూర్ పేరును అధికారికంగా నమోదు చేయాలని ప్రజల విజ్ఞప్తులు…
ప్రజా గొంతుక (మే 25)కాల్వ శ్రీరాంపూర్ గ్రామానికి అధికారిక గుర్తింపు కల్పించాలి.మండల ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా గ్రామాన్ని “కాల్వ శ్రీరాంపూర్” పేరుతో పిలుస్తూ వస్తున్నారు. ప్రజల నోట, స్థానిక చరిత్రలో, సామాజిక కార్యక్రమాల్లో, రాజకీయ,ప్రభుత్వ సమావేశాల్లో కూడా “కాల్వ శ్రీరాంపూర్” అనే పేరే వినియోగంలో ఉంది.అయితే అధికారిక ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం గ్రామం పేరు కేవలం “శ్రీరాంపూర్ “గా నమోదు కావడం వల్ల ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆధార్, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతాలు, భూ రికార్డులు, ఇతర ప్రభుత్వ పత్రాల్లో పేర్ల తేడా కారణంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి.అందువల్ల గ్రామ ప్రజల భావోద్వేగాలను గౌరవిస్తూ, స్థానికంగా ప్రాచుర్యంలో ఉన్న “కాల్వ శ్రీరాంపూర్” పేరునే అధికారిక రికార్డుల్లో నమోదు చేయాలని మండల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.ఈ విషయంలో సంబంధిత అధికారులు,రాజకీయనాయకులు, గ్రామ సర్పంచ్,పాలకవర్గం దీనిపై వెంటనే ఒక తీర్మానం చేసి పై అధికారులకు పంపించాలని స్పందించి, గ్రామ పేరును “కాల్వ శ్రీరాంపూర్”గా మార్చే చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.











