అకాల వర్షం…అన్నదాతలు అతలాకుతలం…
ప్రజా గొంతుక (మే 25) శ్రీరాంపూర్ :అకాల వర్షం అన్నదాతలను అతలాకుతలం చేసింది. కాల్వ శ్రీరాంపూర్ మండలం కేంద్రం లో సోమవారం రోజున ఈదురుగాలతో కూడినఅకాల వర్షానికి కొనుగోలు కేంద్రలలో ఉన్న ధాన్యం తడిసిపోయింది. ఈదురుగాలుల వర్షం వల్ల ధాన్యానికి కాపాడడానికి అన్నదాతల అవస్థలు పడ్డారు. మక్కలు,వరి ధాన్యం కుప్పలు,ఆరబోసిన వడ్ల పక్కన వర్షం నీరు నిలిచింది. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట వర్షం తడవడం తో, సకాలంలో కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలాది క్వింటాళ్ల ధాన్యం తడిసిపోవడంతో రైతులు అయోమయనికి గురవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత కొనుగోలు అధికారులు,రాజకీయ నాయకులు సకాలంలో లారీలను పంపించి, త్వరగా ఎగుమతి చేయాలని రైతులు కోరుకుంటున్నట్లు తెలిపారు.
Post Views: 154











