గాలివాన బీభత్సంతో… ఇంటి పై కప్పులు రేకులు లేచిపోయి బీభత్సం
ప్రజా గొంతుక (మే 25) కాల్వ శ్రీరాంపూర్..మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఇంటి పై కప్పులు ఎగిరిపోవడంతో పాటు ఇంట్లోని నిత్యవసర సరుకులు, సామాగ్రి, దెబ్బతిన్నాయి. ఇంటిలోని వారు భయాందోళనకు గురయ్యారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మల్యాల గ్రామపంచాయతీ పరిధిలోని జగ్గయ్యపల్లి గ్రామానికి చెందిన ఉమ్మన వేన సుజాత రవీందర్ ఇంటి రేకులు సోమవారం మధ్యాహ్నం విచిన ఈదురుగాలులకు ఇంటి పైకప్పు రేకులు లేచిపోయి, బీభత్సం సృష్టించాయి. దీంతో కుటుంబ సభ్యులు దిన వ్యవస్థతో రోడ్డుపైకి వచ్చారు. దీంతో ఇంటిలోని కుటుంబ సభ్యులు లేబదిభోమాంటున్నారు. వారి ఇంటిలోని సామాగ్రి దెబ్బతిన్నాయి. ఆ గ్రామంలోని కొందరి పశువుల కొట్టలు,కూడా కొంత మేర దెబ్బతిన్నట్టు సమాచారం. అధికారులు నాయకులు పరిశీలించి ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. ఈ సంఘటన తెలుసుకున్న గ్రామ సర్పంచ్ సదాశివరెడ్డి,గ్రామ విపిఓ, ఆ ఇంటిని పరిశీలించారు. సంబంధిత పై అధికారుల దృష్టికి తీసుకుపోదయి సహాయం అందేలా కృషి చేస్తాననివారు హామీ ఇచ్చారు.











