డ్రగ్స్ గంజాయి బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలి
చౌటుప్పల్ (ప్రజా గొంతుక) :చౌటుప్పల్ పట్టణంలో డ్రగ్స్, గంజాయి వాడకం పెరుగుతోందని, మరియు బెల్ట్ షాపులు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, వీటిని అరికట్టి యువతను రక్షించడానికి కఠిన చర్యలు తీసుకోవాలని చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్,డీఎస్పీ మధుసూదన్ రెడ్డి కి ,సిఐ మన్మధ కుమార్ కి వినతి పత్రం అందజేశారు. మాదకద్రవ్యాల రవాణాను పూర్తిగా అణిచివేయాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం బెల్టు షాపుల విక్రయదారులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.చౌటుప్పల్ పరిసర ప్రాంతాలు అంతర్రాష్ట్ర గంజాయి రవాణాకు ప్రధాన మార్గంగా మారుతుండటంతో పోలీసులు ప్రత్యేక నిఘా మరియు తనిఖీలను ముమ్మరం చేశారు. చౌటుప్పల్ బస్టాండ్ పరిసర ప్రాంతాలలో భారీగా గంజాయి పట్టుబడిన ఘటనలపై మరింత సమాచారం స్థానిక పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కాంట్రాక్టర్లు గానీ వారి వివరాలు స్థానిక పోలీస్ స్టేషన్లో తెలియపరచాలని అన్నారు.,చైర్మన్ తెలిపిన విషయంపై డిఎస్పి సానుకూలంగా స్పందించి డ్రగ్స్ మాఫియా పై ఉక్కు పాదం మోపుతానని హామీ ఇచ్చారు.











