E-PAPER

మండల బార్డర్లో పోలీసు నిఘా..అక్రమ ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

మండల బార్డర్లో పోలీసు నిఘా..అక్రమ ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

16 Jun 2026, 6:25 pm DISHA POWER

ఎస్కార్ట్‌గా వచ్చిన బుల్లెట్ బైక్ సైతం స్వాధీనం

దిశ పవర్ బచ్చన్నపేట మండలం లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బచ్చన్నపేట ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. కొలనుపాక శివారు వాగు నుండి బొందుగుల గ్రామానికి ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు.విశ్వసనీయ సమాచారంతో నారాయణపురం గ్రామం వద్ద పోలీసులు నిఘా ఉంచారు. ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లతో పాటు వాటికి ఎస్కార్ట్‌గా వస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ మోటార్‌సైకిల్‌ను పోలీసులు పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనపై కొలనుపాక గ్రామానికి చెందిన ట్రాక్టర్ యజమాని, ఇద్దరు డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. మండలంలో ఎక్కడైనా అక్రమ ఇసుక తవ్వకాలు, నిల్వలు, రవాణా జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన మండల ప్రజలను కోరారు.

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!