దిశ పవర్ బచ్చన్నపేట మండలం: ఇటీవల బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎండి మసూద్ నియమితులవడంతో మండల కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. ఆయన నాయకత్వంలో పార్టీ కార్యకలాపాలు మరింత చురుగ్గా సాగుతుండగా, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఎండి మసూద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి, వైఎస్సార్ ప్రజా సంక్షేమ పాలన, రైతులు, పేదలు, విద్యార్థులు, మహిళల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనియాడారు.ఈ సందర్భంగా ఎండి మసూద్ మాట్లాడుతూ, వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేసి ప్రజలకు అందుబాటులో ఉండేలా పనిచేస్తామని తెలిపారు. గుట్ట చైర్మన్, డైరెక్టర్లు, మండల కాంగ్రెస్ నాయకులు, పలు గ్రామాల గ్రామ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు ,పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











