E-PAPER

దేవాదుల కాలువకు మరమ్మతులు చేపట్టి చెరువులు నింపాలి

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

దేవాదుల కాలువకు మరమ్మతులు చేపట్టి చెరువులు నింపాలి

13 Aug 2026, 2:19 pm DISHA POWER

దిశ పవర్ బచ్చన్నపేట: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సకాలంలో కురవకపోవడంతో సాగునీటి సమస్య తీవ్రంగా మారిందని సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఎండి ఫిరోజ్ అన్నారు. వర్షాభావ పరిస్థితులతో రైతులు సాగు కోసం నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని, మరోవైపు చెరువులు, కుంటల్లో నీరు లేక భూగర్భ జలాలు కూడా తగ్గిపోతున్నాయని తెలిపారు. కాలువకు వెంటనే మరమ్మతులు చేపట్టి, అందుబాటులో ఉన్న నీటిని విడుదల చేసి మండలంలోని చెరువులు, కుంటలను నింపాలని ప్రభుత్వాన్ని కోరారు.ముఖ్యంగా దేవాదుల కాలువకు గండి కొట్టి నీటిని అక్రమంగా ఇతర ప్రాంతాలకు మళ్లిస్తున్న ఘటనలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఫిరోజ్ డిమాండ్ చేశారు. కాలువకు గండి కొట్టిన వారిని గుర్తించి విచారణ జరిపి, ప్రభుత్వ నీటిని అక్రమంగా మళ్లించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.వర్షాలు లేకపోవడంతో ఇప్పటికే రైతులు పంటల సాగుపై ఆందోళన చెందుతున్నారని, చెరువులు, కుంటల్లో నీరు ఉంటే పంటలకు మాత్రమే కాకుండా పశువులు, ప్రజలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. దేవాదుల కాలువకు మరమ్మతులు పూర్తిచేసి చెరువులను నింపడం ద్వారా భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!