దిశా పవర్ బచ్చన్నపేట మండలం ,గోపాల్ నగర్ గ్రామంలోని అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ పేర బోయిన కళ్యాణి పరుశురాములు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు ప్రభుత్వ రేషన్ సౌకర్యాలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. గ్రామ ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చింతల కర్ణాకర్, జిపిఓ యాకన్న, రేషన్ డీలర్ ప్రసన్న ఉప్పలయ్య, వార్డు సభ్యులు చింతల లక్ష్మి, గంగరబోయిన ఐలయ్య, మాజీ ఉపసర్పంచ్ వద్ది ఎల్లయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పిట్టల రాములు, మాజీ సర్పంచ్ పర్వతం మధు ప్రసాద్, జనార్ధన్, సుభాష్, సిరిగిరి ఎల్ల స్వామి తదితరులు పాల్గొన్నారు.











