ఉనికి కోసమే బీఆర్‌ఎస్ ‘బాకీ కార్డుల’ నాటకం
కాంగ్రెస్ అభివృద్ధిలో బీఆర్‌ఎస్ గల్లంతు
మండల కాంగ్రెస్ సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు ఇజ్జగిరి రాములు
దిశ పవర్ బచ్చన్నపేట మండలం: గత పదేళ్ల పాలనలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని బీఆర్‌ఎస్ నాయకులు ఇప్పుడు గ్రామగ్రామాన ప్లకార్డులతో నిరసనలు చేపట్టడం హాస్యాస్పదంగా ఉందని మండల కాంగ్రెస్ సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు ఇజ్జగిరి రాములు విమర్శించారు. బీఆర్‌ఎస్ ఉనికిని కాపాడుకునేందుకే ‘బాకీ కార్డుల’ పేరుతో నాటకాలు ఆడుతోందని ఆరోపించారు.డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తామని, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని గతంలో హామీలు ఇచ్చి మాట తప్పారని ఆయన మండిపడ్డారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో అర్హులైన పేదలకు ఒక్క డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కూడా అందించలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి నిర్మాణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లిందని తెలిపారు.గత ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్ కార్డుల జారీకి కూడా కాలయాపన చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి కుటుంబానికి ఆహార భద్రత కార్డులు అందించే దిశగా చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ప్రజలు బీఆర్‌ఎస్‌ను ఇప్పటికే తిరస్కరించారని, ఆ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు.బచ్చన్నపేట మండలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో ఒకటని, సుమారు 220 కిలోమీటర్ల దూరం నుంచి దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసి ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఇజ్జగిరి రాములు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధిని చూసి ఓర్వలేకే బీఆర్‌ఎస్ నాయకులు నిరసనల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండీ మసూద్, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు నల్ల మహేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి దాత్రపు నరేష్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎద్దు హరీష్, జంగిటి విద్యనాథ్, సర్పంచ్ బల్ల రవీందర్, గ్రామ శాఖ అధ్యక్షులు ఇజ్జగిరి నరేష్, రొండ్ల శ్రీనివాస్‌రెడ్డి,, నిమ్మ కరుణాకర్‌రెడ్డి, మ్యాక రవికుమార్, పిట్టల రాములు, కాన్రాజ్ రవీందర్, ఆంజనేయులు,ఇరుగు ప్రకాష్, రమేష్ గౌడ్, నాయకులు పిన్నింటి నారాయణరెడ్డి, ఆముదల మల్ల రెడ్డి,నిడిగొండ శ్రీనివాస్, బాలకిషన్ గౌడ్, గొడుగు కమలాకర్, మట్టి బాలరాజు, అంబాల ఆగయ్య గౌడ్ , రాజేష్ గౌడ్ , ఒగ్గు రాజు, గంగరబోయిన ఐలయ్య,ఎల్లా రాజిరెడ్డి, అఖిల్ మాల, తదితరులు పాల్గొన్నారు.











