*రాష్ట్రస్థాయి జూడో పోటీలకు కేజీబీవీ రాయపర్తి విద్యార్థినుల ఎంపిక*
రాయపర్తి, నవంబర్ 7 దిశ పవర్ న్యూస్
వరంగల్ జిల్లా సబ్ జూనియర్ జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి జూడో పోటీల్లో కేజీబీవీ రాయపర్తి మండల విద్యార్థినులు ప్రతిభ కనబరిచారు, పాఠశాల నుంచి మొత్తం తొమ్మిది మంది విద్యార్థినులు పోటీల్లో పాల్గొనగా, వారిలో నలుగురు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. బి. నిహరిక, బి. సంజన, బి. స్వప్న, ఎం. ప్రియాంక ఈ నెల 13 నుంచి 15 వరకు ఖమ్మం జిల్లా మాచికల్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు, ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థినులను పాఠశాల ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు అభినందించారు, రాష్ట్రస్థాయిలోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు,
Post Views: 132










