శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన ఎల్కతుర్తి పోలీసులు

ప్రజా గొంతుక మార్చి 27:
ఎల్కతుర్తి మండల ప్రజలందరికీ మార్చి 27 శుక్రవారం శ్రీరామ నవమి సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు ఎల్కతుర్తి పోలీసు శాఖ తరపున సీఐ పులి రమెష్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మరియు పోలీసు సిబ్బంది తెలియజేశారు.
సిఐ మాట్లాడుతూ… శ్రీరామ నవమి పర్వదినం ప్రతి ఇంట్లో ఆనందం, శాంతి, ఐక్యతను నింపాలని ఆకాంక్షించారు. ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని, సమాజంలో శాంతి భద్రతలు నెలకొనాలని కోరారు
శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలు నిర్వహించే సమయంలో ప్రజలు పరస్పర సహకారంతో, నియమ నిబంధనలు పాటిస్తూ పండుగను ఘనంగా జరుపుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని, శాంతి భద్రతలకు సహకరించాలని కోరారు.
అలాగే యువత మరియు విద్యార్థులు మంచి మార్గంలో నడుచుకుంటూ, శ్రీరాముని ఆదర్శాలను జీవితంలో ఆచరించాలని సూచించారు. పందాలు, గందరగోళాలు వంటి కార్యక్రమాలకు దూరంగా ఉండి, భక్తి భావంతో పండుగను జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పోలీసు శాఖ ఎల్లప్పుడూ ప్రజల రక్షణకు కట్టుబడి ఉంటుందని, పండుగ సందర్భంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదురైనా పోలీసులను సంప్రదించాలని సూచించారు.
చివరిగా, ఎల్కతుర్తి పోలీసుల తరపున మరోసారి అన్ని వర్గాల ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పండుగను సుఖశాంతులతో జరుపుకోవాలని అన్నా రు 👍











