సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు ఐఎన్టీయూసీ నిరసన దీక్ష
కొత్తగూడెం, మార్చి 28 (ప్రజా గొంతుక న్యూస్):
సింగరేణి కొత్తగూడెం ఏరియా కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ శనివారం ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఏకదిన నిరసన దీక్ష’ విజయవంతమైంది. ఐఎన్టీయూసీ ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి. రజాక్ అధ్యక్షతన జరిగిన ఈ దీక్షకు సీనియర్ నాయకులు త్యాగరాజు, డిసిసి అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, ఆళ్ళ మురళి, కోనేరు సత్యనారాయణ తదితరులు మద్దతు తెలిపారు.
ప్రధాన డిమాండ్లు:
* అండర్ గ్రౌండ్ కార్మికులకు సర్ఫేస్ విభాగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలి.
* స్థానిక నిరుద్యోగులకే అప్రెంటిషిప్ అవకాశం కల్పించాలి.
* వి.కె. మైన్స్‌లో పర్మినెంట్ కార్మికులతోనే బొగ్గు ఉత్పత్తి చేయించాలి.
* డి.ఎల్.ఆర్ (కాంట్రాక్ట్) కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలకు పెంచాలి.
* ఖాళీగా ఉన్న టెక్నీషియన్, క్లర్క్, సూపర్ వైజర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి.
అనంతరం జిఎం పర్సనల్ (IR&PM) కవిత నాయుడు గారికి వినతిపత్రం అందజేయగా, సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు, కార్పొరేటర్లు మరియు భారీ సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.











