పత్తిపాకలో అంగరంగ వైభవంగా శ్రీరాముని కళ్యాణ మహోత్సవ వేడుకలు
ప్రజా గొంతుక ప్రతినిధి / శాయంపేట (మార్చి27):
శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలోనీ శ్రీ సంజీవ ఆంజనేయస్వామి ఆలయంలో పాలకవర్గం ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు అందరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గజ్జి ఐలయ్య దంపతులు ఉపసర్పంచ్ తుడుం రాజు దంపతులు భజన మండలి సభ్యులు పాల్గొని స్వామివారికి తలంబ్రాలు పట్టు వస్త్రాలు మంగళ వాయిద్యాలు తమ తమ ఇండ్ల నుండి తీసుకువచ్చి కళ్యాణ మహోత్సవం జరిపించారు అనంతరం గ్రామ యువకులు మర్రి రమేష్,చెన్న రంజిత్, ఎర్ర రత్నాకర్ రెడ్డి, గంట లక్ష్మారెడ్డి గంట లక్ష్మారెడ్డి, చిన్న శ్రీధర్, అబ్రబోయిన కార్తీక్, రైతుల రాంరెడ్డి వైద్యుల రామ్ రెడ్డి, కందగట్ల సురేష్, వీర గాని భాస్కర్, వందగట్ల గణేష్ కందగట్ల గణేష్, కందగట్ల శ్రీనివాస్, మాచర్ల బాలకిషన్, గుర్రం రమేష్, కునూరు రాజేష్, చెన్న విష్ణు రామకృష్ణ, కందగట్ల అనిల్ ఆధ్వర్యంలో మహా అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భజన మండలి సభ్యులు, మహిళా భజన మండలి సభ్యులు, భక్తులు గ్రామ ప్రజలు గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.











