మహిళా సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ…
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
మహిళా సంఘాల భవనాలకు ప్రభుత్వం ప్రాధాన్యం కల్పిస్తోందని తమ్మడపల్లి సర్పంచ్ బెజడి సిద్ధులు, ఉప సర్పంచ్ గోలకొండ నాగరాజు అన్నారు. గ్రామంలో రూ.10 లక్షల చొప్పున నిధులతో నిర్మించనున్న మహిళా సమాఖ్య భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేసి, కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ గోలకొండ నాగరాజు మాట్లాడుతూ మహిళలు ఆత్మ గౌరవంతో ఉండాలని మహిళా సంఘాల భవనాలకు ప్రభుత్వం ప్రాధాన్యం కల్పించిందన్నారు. నిరుపేదలకు సొంతింటి కల సాకారం కోసం ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేసిందన్నారు. అందరికీ ఉచిత వ్యవసాయ విద్యుత్ అందిస్తు, నేడు 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇళ్లకు అందిస్తోందన్నారు.మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని, గ్రామీణ సమాఖ్యల బలోపేతానికి ఈ భవనాలు దోహదపడతాయని పేర్కొన్నారు.ఈ భవనాలు మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంచి, వారి స్వయం ఉపాధికి బాటలు వేస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నరసింహస్వామి గ్రూప్ సీఏ దాసరి వెంకటలక్ష్మి, వివో అధ్యక్షురాలు బోడిగాం కవిత, కార్యదర్శి దొమ్మాట కావ్య, కోశాధికారి స్వరూప, సహాయ కార్యదర్శి గొల్లపల్లి ఉమారాణి, ఉపాధ్యక్షురాలు ఇంద్రపురి పద్మ, మల్లికార్జున గ్రూపు సీఏ రంగురాణి, వివో అధ్యక్షురాలు మట్టి లత, కార్యదర్శి మధు గాని అనిత, కోశాధికారి కంసాని మంజుల, ఉపాధ్యక్షురాలు పిల్లి సువర్ణ, సహకార కార్యదర్శి మేకల మాధవి వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.











